Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెనక్కి తగ్గేదేలేదన్న మిథున్ రెడ్డి.. హైకోర్టులో వైసీపీ పిటిషన్

Mithun Reddy says no backing down as YSRCP files petition in High Court
Advertisement
  • పుంగనూరు నామినేషన్ల వివాదంపై హైకోర్టులో వైసీపీ పిటిషన్
  • పోలీసు రక్షణ కల్పించి నామినేషన్లు వేయించాలని వినతి
  • న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధమన్న మిథున్ రెడ్డి
Advertisement
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది. అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

నామినేషన్ల తొలి రోజైన శుక్రవారం పుంగనూరులో అధికార టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో మాట్లాడిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి... అధికార పార్టీ అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. "నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలను అడ్డుకోవడానికి, మా అభ్యర్థుల న్యాయమైన హక్కులను కాపాడటానికి ఎంతటి న్యాయ పోరాటానికైనా మేము సిద్ధం" అని ఆయన ప్రకటించారు. 

మరోవైపు, ఈ ఘర్షణల ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి, ఎంపీ మిథున్ రెడ్డితో సహా 70 మందిని నిందితులుగా చేర్చారు. శాంతిభద్రతల దృష్ట్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి పుంగనూరు పట్టణంలోకి ప్రవేశించరాదని పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Advertisement
Advertisement
Mithun Reddy
Punganur Municipal Elections
YSRCP
AP High Court
Peddireddy Ramachandra Reddy
TDP

More Telugu News